AKP: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కసింకోట ఎస్సై లక్ష్మణరావు మంగళవారం తెలిపారు. 2019 డిసెంబర్ నెలలో 165 కిలోల గంజాయి రవాణా చేస్తుండగా పశ్చిమబెంగాల్‌కు చెందిన డెబాసిన్ ఘెరాయ్ పట్టుపడ్డాడు. బెయిల్ పై బయటకు వచ్చిన నిందితుడు కోర్టుకు హాజరు కావడం లేదు. అతనిపై నాన్ బైబిల్ జారీ కావడంతో పశ్చిమ బెంగాల్ వెళ్లి అరెస్టు చేసారు.