AP: సీఎం చంద్రబాబు నివాసంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు కూటమి నేతల కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరుకానున్నారు. మహిళా బిల్లు ఆమోదం తర్వాతి పరిణామాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, కూటమి పార్టీల మధ్య సమన్వయంపై ఈ సందర్భంగా చర్చించనున్నారు.