WGL: వరంగల్ నిట్ గణిత విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ వికాస్ శ్రీవాస్తవ ANRF ECRG పరిశోధన నిధులను సాధించారు. క్వాంటం-సేఫ్ సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరయ్యాయి. AI, మెషిన్ లెర్నింగ్ భద్రతకు సంబంధించిన పరిశోధనలు ఈ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టనున్నారు. దీంతో ఆయనకు మంగళవారం నిట్ వరంగల్ యాజమాన్యం అభినందనలు తెలిపింది.