HYD: నగరానికి చెందిన 18 ఏళ్ల నాగ మోక్ష ఎర్రం ప్రతిష్టాత్మక ‘యూఎస్ ఓపెన్ పికల్బాల్ ఛాంపియన్షిప్’లో కాంస్య పతకం సాధించి, రాష్ట్ర కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఐపీఏ నేషనల్స్ 2025లో రెండు స్వర్ణ పతకాలతో రాణించిన మోక్ష, అదే స్ఫూర్తితో అమెరికాలో జరిగిన ఈవెంట్లో సత్తా చాటారు. మోక్ష ప్రతిభను ఒలింపియన్ విష్ణువర్ధన్ అభినందించారు.