VKB: ధరూర్ మండలం రాజాపూర్ రెవెన్యూ పరిధిలో ఫామ్ ల్యాండ్ దందా యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలు అతిక్రమించి రైతులకు నీరందించే కాలువలను సైతం కబ్జా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కేవలం నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారని, ఆక్రమణలు తొలగించడంలో విఫలమయ్యారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.