MNCL: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మంచి సేవలు అందించాలని లక్షెట్టిపేట మున్సిపల్ ఛైర్పర్సన్ దొంత అంజలి, వైస్ ఛైర్పర్సన్ మోత్కూరి రాజేశ్వరి, సీడీపీవో రేష్మ కోరారు. ఇవాళ పట్టణంలోని సీడీపీవో కార్యాలయంలో వివిధ మండలాలకు చెందిన 109 మంది అంగన్వాడి టీచర్లకు సరఫరా చేసిన సెల్పోన్ల పంపిణీ, పోషన్ పక్వాడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.