HNK: హనుమకొండ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నేతలతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డి సమావేశమయ్యారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రేపు హాసన్పర్తి మండలంలోని పెంబర్తిలో కుల వివక్షకు వ్యతిరేకంగా సహపంక్తి భోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజలంతా సోదరా భావంతో కలిసిమెలిసి ఉండాలని జిల్లా అధ్యక్షుడు అన్నారు.