SRPT: తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన ‘ప్రజా పాలన’లో సీపీఎం నాయకుడు కడెం లింగయ్య అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పించన్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.