BHNG: రాయగిరికి చెందిన చింతల మనిలకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కును ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకం పేదింటి మహిళలకు ఆర్థికంగా ఎంతో బాసటగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కాకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెంకటేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.