GDWL: మల్దకల్ మండలం నేతువానిపల్లి శివారులో చిరుత దాడిలో పశువులు, గొర్రెలు కోల్పోయిన రైతులకు పరిహారం అందిస్తామని గద్వాల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్వేజ్ అహ్మద్ తెలిపారు. మొత్తం 8 జీవాలు మృతి చెందినట్లు గుర్తించామని చెప్పారు. ఇప్పటికే ఇద్దరికి పరిహారం చెల్లించగా, మిగిలిన వారికి త్వరలో చెల్లిస్తామన్నారు. వెటర్నరీ రిపోర్టు ఆధారంగా పరిహారం మంజూరు అవుతుందని వెల్లడించారు.