MDK: నార్సింగి మండల కేంద్రంలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. SI సృజన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను విస్మరించరాదన్నారు. ముఖ్యంగా వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని అవగాహన కల్పించారు.