PLD: పెదకూరపాడు మండలం 75- త్యాళ్ళూరు పీఎం శ్రీ హైస్కూల్లో ఈ విద్యా సంవత్సరపు చివరి “నో బ్యాగ్ డే” శనివారం ఘనంగా ముగిసింది. విద్యార్థులపై పుస్తకాల భారాన్ని తగ్గించి, అభ్యాసాన్ని సరదాగా, నైపుణ్య ఆధారితంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ ముగింపు వేడుకలో హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని వివిధ కృత్యాలు నిర్వహించారు.