SDPT: సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆమె, పప్పు పలుచగా ఉండటంపై వంట సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “సాంబార్ ఇలాగే ఉంటుందా?” అని ప్రశ్నిస్తూ, విద్యార్థినులకు నాణ్య మైన భోజనం అందించాలని ఆదేశించారు.