RR: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయ మార్గం అపూర్వమని మాల మహానాడు మండల అధ్యక్షులు శేఖర్ మాల అన్నారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జ్ఞాన యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ షాద్ నగర్ పట్టణంలోని బ్లాక్ ఆఫీసులో అంబేద్కర్ విగ్రహం ముందు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈనెల 14న రైల్వే స్టేషన్ నుంచి బ్లాక్ ఆఫీసు వరకు జ్ఞాన యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు.