PDPL: ధర్మారంలోని బ్రిలియంట్ స్కూల్ విద్యార్థులకు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇవాళ రోడ్ సేఫ్టీ నియమాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం, బస్సు ఎక్కుతున్నప్పుడు రోడ్డు క్రాస్ చేసే విధానం, మూల మలుపుల వద్ద ఎలా వెళ్లాలో తెలుపుతూ విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.