KMM: వైరాలోని 11వ వార్డులో కౌన్సిలర్ దొంతుబోయిన వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఉచిత మెడికల్ క్యాంప్’ను వైరా ఎస్సై పుప్పాల రామారావు నేడు ప్రారంభించారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని కాంక్షించి ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సామాన్యులకు వైద్య సేవలను చేరువ చేసేందుకు నాయకులు చొరవ చూపడం మంచిదన్నారు.