BHPL: కాటారం మండలం నస్తూరిపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో రూ. 2,063 కోట్లు జమ చేయనున్నారు. యాసంగి సాయంతో కలిపి రైతులకు మొత్తం రూ. 5,653 కోట్ల పెట్టుబడి సహాయం అందనుంది. మూడో విడత నిధులను త్వరలో అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.