ATP: రాయదుర్గం పేరు చారిత్రక నేపథ్యంతో ప్రసిద్ధి చెందింది. ‘రాయల దుర్గం’ అంటే రాజుల కోట అనే అర్థంతో ఈ పేరు వచ్చినట్లు చెబుతారు. విజయనగర సామ్రాజ్యానికి చెందిన పాలకులు నిర్మించిన రాయదుర్గ కోట చుట్టూ గ్రామం అభివృద్ధి చెందింది. కాలక్రమంలో రాయలదుర్గం రాయదుర్గంగా మారిందని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం రాయదుర్గం ఎమ్మెల్యేగా కాలవ శ్రీనివాసులు ఉన్నారు.