2026 ఐపీఎల్ సీజన్లో RR స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ సంచలనం సృష్టించాడు. ఈ సీజన్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీశాడు. ఫిల్ సాల్ట్ (RCB), అభిషేక్ శర్మ (SRH) వికెట్లు పడగొట్టిన ఆర్చర్.. తాజాగా KKRతో మ్యాచ్‌లోనూ టిమ్ సీఫెర్ట్‌ను తొలి బంతికే ఔట్ చేశాడు. మొత్తంగా IPL చరిత్రలో తొలి బంతికే వికెట్ సాధించడం అతడికి ఇది నాలుగోసారి.