SKLM: ముందు జాగ్రత్తతోనే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చునని ఆముదాలవలస ఫైర్ ఆఫీసర్ ఎస్. శ్రీనివాసరావు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆముదాలవలసలోని ఓ హాస్పిటల్ వద్ద ఎలక్ట్రికల్ అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫైర్ సిబ్బంది వివరించారు.