TG: సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి అబద్ధాల పునాదులపై సీఎం అయ్యారని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు, ఇప్పుడు చేస్తున్న పాలనకు అసలు పొంతనే లేదని, మహిళా బిల్లును అడ్డుకోవాలని చూస్తూ రేవంత్ దక్షిణాది రాష్ట్రాలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.