సత్యసాయి: కదిరి పట్టణంలోని బీజేపీ కాలనీలో ఆదివారం గ్రామ దేవత ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ దేవత ఉత్సవాలు గ్రామీణ సంస్కృతికి ప్రతీకలని, ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.