ADB: PDSU వ్యవస్థాపకులు జార్జిరెడ్డి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని PDSU జిల్లాధ్యక్షుడు దీప అన్నారు. జార్జిరెడ్డి 54వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని బాలికల గిరిజన వసతి గృహంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జార్జి రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.