JN: రైతు సంక్షేమానికి మాజీ సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపురం, సారంగాపూర్ గ్రామాల్లో BRS ముఖ్య నేతలతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈనెల 20వ తేదీన నిర్వహించబోయే మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు.