NLG: కోతుల గుంపుతో చిట్యాల ప్రజలు అగచాట్లు పడుతున్నారు. అవి సృష్టించే భీభత్సానికి బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే పట్టణంలో ఉన్న కోతులకు తోడు వందల కొద్ది కోతులు ఎర్రమ గుట్టకు చేరి కిష్కింద కాండను గుర్తు చేస్తున్నాయి. ఎవరైనా వదిలారా ఎక్కడినుండైనా వలస వచ్చాయో తెలియదు కానీ వరి, కూరగాయల పంటలను తోటలను నాశనం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.