WGL: నర్సంపేట పట్టణానికి చెందిన విద్యావేత్త డాక్టర్ బోడ అనిల్ కుమార్ నేతృత్వంలో 50 మంది నాయకులు శనివారం హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి యువత ముందుకు రావాలని, జాగృతి ద్వారా సేవా కార్యక్రమాలు విస్తరించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.