నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు, ట్రేడ్ లైసెన్సులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర తెలిపారు. నగర అభివృద్ధికి అవసరమైన ఆదాయ వనరులను బలోపేతం చేయడం అత్యంత అవసరమన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నగరంలోని వ్యాపారులు, ఆస్తి యజమానులను ఉద్దేశించి మాట్లాడారు.