RR: శంకర్ పల్లి చౌరస్తాలోని బస్ స్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన ‘మణికంఠ ఆర్గానిక్ మిల్క్ పాయింట్, ఐస్క్రీమ్ పార్లర్ & కూల్ పాయింట్’ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. యువత తమకు నచ్చిన రంగంలో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సాత్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.