NRPT: కృష్ణ మండలంలోని 8వ వార్డులో ఇళ్లపై నుంచి విద్యుత్ తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. కాలనీవాసులు ప్రాణభయంతో జీవిస్తున్నారు. పలుమార్లు షార్ట్ సర్క్యూట్ జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వర్షాకాలం దృష్ట్యా ప్రమాదం పెరిగే అవకాశం ఉందని, వెంటనే వైర్లను సరిచేసి తమ ప్రాణాలు కాపాడాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.