ఆదిలాబాద్ మున్సిపాలిటీ పురోభివృద్ధిలో బడ్జెట్ అత్యంత కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ సమావేశాన్ని మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూషతో కలిసి నిర్వహించారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకై అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.