SRCL: రైతులకు, ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని TGNPDCL సీఎండీ వరుణ్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేటలోని సబ్‌స్టేషన్‌ను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్‌స్టేషన్ ఆవరణను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న 2491 వ్యవసాయ విద్యుత్ దరఖాస్తులను గుర్తించి వేగంగా పూర్తి చేయాలన్నారు.