HNK: పరకాల మండలం హైబోత్పల్లిలో వివాహితపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 9న రేషన్ షాప్ వద్ద దేవరనేని సంధ్య, తాటికొండ రాజయ్య మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం పెద్దగా మారి, రాజయ్య ఆమెపై దాడి చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. కేసునమోదు చేయాలని డిమాండ్ చేసింది.