GDWL: జిల్లాలోని గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన ప్రిన్సిపాల్ గా నేడు పి.మంజుల పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈమె గతంలో మహబూబ్ నగర్ జిల్లాలోని యమనగండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ జూనియర్ లెక్చరర్ గా పని చేస్తూ ఇటీవల పదోన్నతి పొంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల రెగ్యులర్ ప్రిన్సిపల్ గా రావడం జరిగిందన్నారు.