MNCL: ప్రభుత్వ పాఠశాలలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాల రాజీవ్ నగర్లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు గదుల నిర్మాణ పనులు, వంటశాల, సామాగ్రి నిల్వ గదిని పరిశీలించి పలు సూచనలు చేశారు.