KNR: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్మికుల పట్ల మొండివైఖరి వీడాలని, పని ఒత్తిడితో మహిళా కార్మికులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.