KMM: కార్మిక హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని సీఐటీయు జిల్లా కోశాధికారి చలమల విట్టల్ పిలుపునిచ్చారు. ఆదివారం బోనకల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త లేబర్ కోడ్స్ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.