వరంగల్ జిల్లాలో ఈ నెల 20 నుంచి 27 వరకు జరిగే తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద బుధవారం అధికారులకు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ప్రశ్నపత్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వేసవి ఎండల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.