MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2,4,5,6 సెమిస్టర్ల పరీక్షలను వాయిదా వేయాలని ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ విద్యార్థులు అధికారులను కోరుతున్నారు. ప్రతి సంవత్సరం మే నెలలో జరగవలసిన పరీక్షలను సిలబస్ పూర్తికాక ముందే ఏప్రిల్ 16 నుంచే పరీక్షలు నిర్వహించడం పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మే నెలలో పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.