అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘డెకాయిట్’పై భారీ అంచనాలు ఉన్నాయి. షానీల్ డియో తెరకెక్కించిన ఈ మూవీకి ఇతర సినిమాల మాదిరిగా ఇండియాలో ముందు రోజే ప్రీమియర్స్ ఉంటాయని అభిమానులు ఆశించారు. అయితే, ఇండియాలో ఎలాంటి ప్రీమియర్స్ లేవని శేష్ స్పష్టం చేశాడు. ఏప్రిల్ 10న ఉదయం 8 గంటల షోలతోనే సినిమా ప్రారంభం కానుందని క్లారిటీ ఇచ్చాడు.