MDK: రామాయంపేటలో ముదురుతున్న ఎండలకు పక్షికోటి అల్లాడుతోంది. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో పక్షులు నీటి కోసం ఊళ్లపై పడుతున్నాయి. పొలాల వద్ద ఎక్కడ నీరు కనిపిస్తే అక్కడ వందల సంఖ్యలో వాలిపోతూ దాహార్తితో కొట్టుమిట్టాడుతున్నాయి. పక్షుల ప్రాణాలను కాపాడడం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ తమ ఇంటి మేడపై, బాల్కనీలో లేదా ప్రధాన కూడళ్లలో మట్టి పాత్రల్లో నీరు ఉంచాలి.