NZB: పేదల ఆకలి తీర్చే PDS బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. బోధన్ మండలం పాగిడేపల్లిలో 450 క్వింటాళ్ల బియ్యం పట్టుబడటంతో నిఘా ముమ్మరం చేశారు. ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మితే, లబ్ధిదారుల రేషన్ కార్డులతో పాటు ఇతర సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.