SRCL: ప్రతి కూలికి పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉపాధి హామీ పథకం అధికారులు తెలిపారు. వీర్నపల్లి మండలం చెరువు తండాలో ఉపాధి హామీ పనులను సర్పంచ్ మాలోత్ సుధాకర్ ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి ఈ పథకం ఎంతో దోహదపడుతుందని, కూలీలకు స్థానికంగానే ఉపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు, పాల్గొన్నారు.