ELR: పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యానికి మొదటి ఆరు సంవత్సరాలలో అందించే పోషకాహారమే ప్రధానమని కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. పోషణ అభియాన్లో భాగంగా 8వ విడత పోషణ పక్వాడ పోస్టర్ను కలెక్టర్ గురువారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్న పిల్లల్లో పోషకాహార లోపాన్ని పోగొట్టేందుకు పూర్తిస్థాయిలో పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు.