TPT: తిరుపతి నగర ప్రజల దీర్ఘకాల స్వప్నమైన మంగళం ఆర్టీవో కార్యాలయం నుంచి శెట్టిపల్లి మీదుగా రేణిగుంట వరకు నిలిచిపోయిన రహదారి నిర్మాణానికి ముందడుగు పడింది. ఈ మేరకు మంగళం వద్ద తెలుగు గంగ పైప్లైన్ షిఫ్టింగ్ పనులకు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు.