BHPL: చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి ఆలయ మొదటి వార్షికోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆలయాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతల పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్నారు.