ASR: కొయ్యూరు మండలం కాకరపాడుకు చెందిన సునీత (24) అనే గర్భిణికి ఇవాళ సాయంత్రం పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో, 108 సిబ్బంది అంబులెన్సులో వెంటనే అక్కడకు చేరుకున్నారు. అయితే అప్పటికే నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఈఎంటీ ఈశ్వరరావు, పైలెట్ వర ప్రసాద్‌లు గర్భిణీకి ఇంట్లోనే ప్రసవం చేశారు. అనంతరం, వైద్యం కోసం పీహెచ్‌సీకి తరలించారు.