ADB: ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 15, 16 తేదీల్లో జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో.. ‘గిరిజన అభివృద్ధి పునర్నిర్మాణం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ అంశాలు’ అనే ప్రధాన ఇతివృత్తంపై చర్చించనున్నారు.