PPM: అరకు ఎంపీ నిధులు మంజూరు చేసినా.. మన్యం జిల్లా అధికారులు వాటిని అభివృద్ది కోసం ఎందుకు ఖర్చు చేయడం లేదని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పి.రంజిత్ అన్నారు. అధికారులు నిధులు తేలేరు, ఎంపీ ఇచ్చిన నిధులు ఖర్చు చేయరు ఇదేం పద్దతి అని ప్రశ్నించారు. నిధులు ఖర్చు చేయకపోవడం అంటే మన్యం జిల్లా ప్రజలను నిర్లక్ష్యం చేయటమేనని ఆయన పేర్కొన్నారు.