ADB: నార్నూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిని నీతి ఆయోగ్ బృందం సందర్శించింది. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, ఓపీడీ వార్డుల నిర్వహణను బృందం సభ్యులు సమగ్రంగా పరిశీలించారు. రికార్డులు, సిబ్బంది హాజరు, పరిశుభ్రతను తనిఖీ చేసి, మెరుగైన వైద్యంపై పలు సూచనలు చేశారు. ఈ పర్యటన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.