CTR: విజయపురం(M) శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకమరాజు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సూరలక్ష్మి, సురేష్, సుబ్రహ్మణ్యం, సుజాత పాల్గొని బాబాసాహెబ్ సేవలను స్మరించుకున్నారు.